మరీ ఇంత దారుణమా ... ? పాడైన పచ్చళ్ళు ... కెమికల్ కేక్స్, కాలం చెల్లిన చాక్లెట్స్
- ఇదీ ఖమ్మంలోని కొన్ని రెస్టారెంట్స్, స్వీట్ షాపుల భాగోతం
- లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం
- ఫుడ్ సేఫ్టీ అధికారుల విస్తృత తనిఖీల్లో విస్తుపోయే నిజాలు
లాభాల కోసం కొన్ని రెస్టారెంట్లు, స్వీట్ షాపుల యజమానులు ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. పాడై పోయిన, కాలం చెల్లిన, రసాయనాలు కలిసిన ఆహార పదార్ధాలను యదేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికార్లు ఖమ్మం నగరంలో జరిపిన దాడుల్లో ఈ విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. నగరంలోని పలు రెస్టారెంట్లు, వివిధ మసాలా దినుసులు (స్పైసెస్), పచ్చళ్ల, స్వీట్స్ యారీ కేంద్రాలపై తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ బృందం శుక్రవారం ఆకస్మిక దాడులు జరిపింది. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రోహిత్ రెడ్డి, పి. స్వాతి, శ్రీషిక, సిహెచ్. లోకేష్, శరత్ వైరా రోడ్లోని పీఎస్కే ఫుడ్స్ అండ్ స్పైసెస్, ఎన్టీఆర్ సర్కిల్లోని జీ.పి. రెడ్డి ఘీ స్వీట్ షాప్, ఐస్ క్రీమ్ యూనిట్, పాలమూరు గ్రిల్స్ రెస్టారెంట్లో ఈ దాడులు జరిగాయి.
పాలమూరు గ్రిల్స్ రెస్టారెంట్లో ...
పాలమూరు గ్రిల్స్ రెస్టారెంట్ వంట గది
అపరిశుభ్రంగా ఉండడం, రిఫ్రిజిరేటర్, కోల్డ్ ఛాంబర్లో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం సరైన
ఉష్ణోగ్రతను మెయిన్ టైన్ చేయక పోవడం, సుమారు 2 వేల రూపాయల విలువ కలిగిన 8 లీటర్ల కాలం చెల్లిన ఫ్రూట్
క్రషెస్,
సుమారు19 వేల రూపాయల విలువ గల 40 కిలోల కాజు, షాజీరా, నూడిల్స్, ఇతర ముడి సరుకులపై
లేబుల్ డిఫెక్ట్స్ ను తనిఖీ బృందం గుర్తించింది. అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ
ఉంచిన కూరగాయలను గుర్తించి, హోటల్ యాజమాన్యం పై ఫుడ్
సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్ వి. జ్యోతిర్మయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల
ఆరోగ్యానికి భంగం కలగకూడదని అప్పటికప్పుడే వాటిని ధ్వంసం చేసి, ఎఫ్.ఎస్.ఎస్ చట్టాన్ని
ఉల్లంఘించినందుకు నోటీసులు జారీ జారీ చేశారు.
పీఎస్కే ఫుడ్స్ అండ్ స్పైసెస్లో ...
అలాగే వైరా రోడ్ లో గల పీఎస్కే ఫుడ్స్ అండ్ స్పైసెస్లో విస్తృత తనిఖీలు చేసి, ఫుడ్ హ్యాండ్లర్స్
ఎటువంటి ప్రమాణాలు, వ్యక్తిగత
పరిశుభ్రత పాటించక పోవడం, తయారీ కేంద్రంలో తగిన
లైటింగ్,
వెంటిలేషన్
లేకపోవడం, ప్లాస్టిక్
డ్రమ్ములలో పచ్చళ్లను నిల్వ ఉంచడం, ముడి సరుకులు నిల్వ
ఉంచడానికి సరైన స్టోరేజ్ సదుపాయాలు లేక పోవడం, ఆహార పదార్థాలు, ముడి సరుకులపై ఈగలు
ఉండడం గమనించారు. లేబుల్ డిఫెక్ట్స్ కలిగిన రెడీ టు ఈట్ సేవరిస్, మినప్పప్పు, రాక్ సాల్ట్ , బెల్లం, నూనె, నెయ్యి గుర్తించి సీజ్
చేశారు. అనుమానిత శాంపిళ్లను పరీక్ష కోసం హైదరాబాదులోని ల్యాబ్ కు పంపారు. ఎఫ్.ఎస్.ఎస్.
చట్టం 2006 ఉల్లంఘించినందుకు నోటీసులు జారీ చేశారు.
ఐబాకో ఐస్ క్రీమ్ యూనిట్లో ...
వైరా రోడ్లో గల ఐబాకో ఐస్ క్రీమ్ యూనిట్లో సరైన పేరుతో లైసెన్స్ లేక పోవడం, అపరిశుభ్ర వాతావరణంలో
ఐస్ క్రీములు, చాక్లెట్లు
నిల్వ ఉంచడం, తయారీ, ఎక్స్పైరీ డేట్లను
వినియోగదారులకు సరైన పద్దతిలో డిస్ ప్లే చేయక పోవడం, అపరిశుభ్ర వాతావరణంలో
రిఫ్రిజిరేటర్లలో చాక్లెట్లు ఇతర
పదార్థాలను నిల్వ ఉంచడం, సరైన పెస్ట్ కంట్రోల్ పద్ధతులను పాటించక పోవడంతో
యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.
జీపీ రెడ్డి ఘీ స్వీట్స్ లో ...
ఎన్టీఆర్ సర్కిల్ లో గల జీపీ రెడ్డి ఘీ స్వీట్స్ లో పూర్తిగా అపరిశుభ్ర
వాతావరణంలో కేక్స్ తయారు చేయడం, కేక్స్, ఇతర స్వీట్స్ తయారీలో హానికర రసాయనాలు కలిగిన రంగులు
కలపడం,
ప్లాస్టిక్
బకెట్లలో క్రీమును నిల్వ ఉంచడం, ఈగలతో కూడినటువంటి కేకు ను నిల్వ ఉంచడం, 20 వేల రూపాయల విలువగల
ఐదు కిలోల కాలం చెల్లిన చెర్రీస్, ఫ్రూట్ క్రషెస్ గుర్తించి, వాటిని అక్కడికక్కడే ధ్వంసం చేశారు.
లేబుల్ డిఫెక్ట్స్ కలిగిన సుమారు 30 వేల రూపాయల విలువ గల 15 కిలోల కన్ఫెక్షనరీ పదార్థాలు, డ్రై ఫ్రూట్స్, మిస్సలేనియస్
పదార్థాలను సీజ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా ఆహారాన్ని ప్రజలకు
విక్రయించాలని,లేని
యెడల చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి, అవసరమైతే సంబంధిత శాఖ
సహాయంతో సీజ్ కూడా చేస్తామని ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ టీం హెడ్ వంకాయలపాటి
జ్యోతిర్మయి హెచ్చరించారు.
.jpeg)


.jpeg)
.jpeg)
.jpeg)
Comments
Post a Comment